చంద్రబాబు ఇళ్లయ్యా.. జర పట్టించుకోండి..


‘‘ఏ పోవయ్యా.. కేవలం 2400 చదరపు అడుగులు స్థలంలో ఏదో ఓ ఇళ్లు కట్టుకుంటున్నాడాయన… అదో చిన్న ఇళ్లు.. జగన్ లా రాజభవనమా.. దాని గురించి రాయడానికి.. చూపించడానికి..’’ ఓ మీడియా మిత్రుడి మాట ఇది.. చంద్రబాబు ఇంటి విషయంలో పత్రికలు, మీడియా సైలెంట్ అయ్యింది. పోలీసులను కాపలపెట్టి మరీ కట్టించుకుంటున్న చంద్రబాబు ఇంద్రభవనం గురించి ఎక్కడా కూడా వార్తలు, వీడియోలు విశ్లేషణలు రాకుండా ఎల్లో మీడియా పకడ్బందీగా ముందుకెళ్తోంది. దాని తెరవెనుక బాబు ఉన్నాడు లెండి..

ఈ వైసీపీ వాళ్లు శుద్ధ వేస్టు.. ఎప్పుడూ అవకాశం అందిపుచ్చుకోరు.. చంద్రబాబుపై విమర్శలకు చక్కటి అవకాశం వచ్చినా అందిపుచ్చుకోరు.. ఏం మనుషులో ఏమో.. చంద్రబాబు కోట లాంటి ఇళ్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా.. వీళ్లకు ఆయన్ను బ్లేమ్ చేయడం రాదు.. అప్పట్లో జగన్ ఇంటి గురించి చంద్రబాబు.. ఆయన పచ్చమీడియా చేసిన రాద్దాంతం ఒక్కసారి గుర్తుతెచ్చుకోండయ్యా…

చంద్రబాబు పాత ఇంటిని కూలగొట్టి కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్నాడు. స్థలం సరిపోకపోతే.. పక్కనున్న వారిని బతిమిలాడి చౌకధరకే 1285 అడుగుల స్థలాన్ని కొని మొత్తం 2400 అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్ నిర్మించారు. ఇందుకోసం బరోడా బ్యాంకు నుంచి రూ.7 కోట్లు అప్పు తీసుకున్నాడు.. (ఏపీ సీఎం అప్పుచేయడామా.. అది ఐటీ లెక్కలు చూపించడానికే..) ఆ స్థలం పోను మిగతాది గార్డెన్ కోసం.. లోపలికి వెళితే ఇంద్రభవనమే.. గ్రౌండ్ ఫ్లోర్ లో పే…ద్ద మీటింగ్ హాల్.. మొత్తం 5 అంతస్థుల్లో బెడ్ రూంలు, స్విమ్మింగ్ ఫూలు, అబ్బో కోట్ల విలువ చేసే ఇంటీరియర్ డిజైన్లతో విదేశాల్లో ఉన్న ఇళ్లు మాదిరి ఉంది.. కానీ దర్జాగా.. హైదరాబాద్ నడిబొడ్డున బాబు కట్టుకుంటున్నా ఎక్కడా వార్తలు రావడం లేదు. విశేషాలు చూపించడం లేదు.. అదే చంద్రబాబు మాయాజాలం అంటే.. ఇదే జగనో.. పవనో కట్టుకుంటేనే ఇప్పటికీ అన్నిచానళ్లు, పత్రికలు రచ్చ రచ్చ చేసి.. రొచ్చు మిగిల్చేవారు.. హతవిధీ ఈ వన్ సైడ్ మీడియా గతి ఏంటి.?

జగన్ మీడియాకు, జగన్, వైసీపీ అనుకూలురకు చంద్రబాబు కొత్త ఇంటి గురించి కనీసం చింత లేదు. అదే అప్పట్లో జగన్ లోటస్ పాండ్, బెంగళూరుల్లో ఇళ్లు కట్టుకుంటే ఈ పచ్చమీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 లాంటి వాళ్లు ఎంత రచ్చచేశారో.. కానీ ఇప్పుడు అంతకుమించి కోట్లు ఖర్చు చేసి కట్టుకుంటున్నా.. కనీసం వీరి నోరు మెదపరు.. ఇప్పటికైనా బాబు రాజమందిరం గురించి జర పట్టించుకోండయ్యా.. మంచి తరుణం.. మించిన దొరకదు మరీ..

To Top

Send this to a friend