2019 కూడా నాదే.. జగన్ కు బాబు హెచ్చరిక

చంద్రబాబులో ఉత్సాహం తొణికిసలాడుతోంది. నంద్యాల గెలుపు ఇచ్చిన ఉత్సాహంలో వైసీపీని తుడిచిపెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. సమరోత్సాహంలో జగన్ కు సీఎం సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లోనూ తమదే విజయం అని చంద్రబాబు ప్రకటించారు. ఇలానే అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తామని.. తమను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జగన్ విసిరిన సవాల్ ను చంద్రబాబు పునరుద్ఘాటించారు. పార్లమెంటు వర్షకాల సమావేశాల అనంతరం ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలను రాజీనామా చేయిస్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడు ఆ పనిచేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. మాట తప్పను, మడమ తిప్పను అంటారుగా ఇప్పుడు మాటపై నిలబడండి..’ అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు డేరా బాబాను జగన్ తో పోల్చుతూ విమర్శలు చేయడం దుమారం రేపింది. ఒక సాధువుగా ఉండి ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న డేరా బాబా జైలుకు వెళ్లాడని.. రాజకీయాల్లో జగన్ బాబా కూడా హింస, ఉన్మానం, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాడని సీఎం మండిపడ్డారు.

To Top

Send this to a friend