అమిత్ షా ఏపీ సర్వేతో బాబుకు షాక్

బీజేపీ మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మోడీ పాలనపై.. రాష్ట్రాల్లో బీజేపీ, మిత్రపక్షాలున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై సర్వే నిర్వహించిందట.. ఈ సర్వే వివరాలను అమిత్ షా ఇటీవలి పర్యటనలో బాబుకు చెప్పినట్టు కమలనాథులు రిలీవ్ చేశారు.

కేంద్రం నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికి, చంద్రబాబుకు ఆదరణ ఉందని తేలిందట… సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని కేంద్రం సాయంతో అభివృద్ధి చేసేందుకు బాగా కష్టపడుతున్నాడని సర్వేలో తేలిందట.. చంద్రబాబుకు ప్రజలంతా మంచి మార్కులు వేశారని తెలిపారు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపై మాత్రం ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని సర్వేలో తేలిందట.. ఇదే ఎమ్మెల్యేలను నిలబెడితే ఖచ్చితంగా ఓటమి ఖాయమని అమిత్ షా.. చంద్రబాబును హెచ్చరించినట్టు తెలిసింది.

అమిత్ షా చెప్పిన విషయాలపై చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలిసింది. అవినీతి ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని అమిత్ షాతో అన్నట్టు సమాచారం. ఈ ప్రకటన వెలువడడంతో టీడీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది.

కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని ఏపీ బీజేపీ నేతలు అమిత్ షాకు విన్నవించగా.. ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమికే ప్రజల్లో ఇంకా ఆదరణ ఉందని.. చంద్రబాబు పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని సర్వేలో తేలిందని అమిత్ షా బీజేపీ నేతల దగ్గర ప్రస్తావించారు. 11 చార్జిషీట్లు ఉండి అవినీతితో మకిలిపట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో ఎలా పొత్తుపెట్టుకుంటారని నిలదీశారు. దీంతో వచ్చేసారి టీడీపీతోనే ఎన్నికలకు వెళ్తామని అమిత్ షా చెప్పకనే చెప్పాడు.

To Top

Send this to a friend