అక్కడున్నది కేసీఆర్ .. చంద్రబాబూ..

తెలంగాణలో ఉన్న దిగ్గజ టీడీపీ రాజకీయ నాయకులందరూ దాదాపు టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం అప్పట్లోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారిలో కీలక వ్యక్తి అయిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రవీందర్ రావులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశానికి రేవంత్ రెడ్డి మినహా సీనియర్ నాయకులు ఎవరూ లేకుండా పోయారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో రేవంత్ కూడా బీజేపీలో చేరిపోయి ఆ పార్టీని లీడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఇంతలా కునారిల్లుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు అధికారంలోకి తీసుకొస్తానని విశాఖ వేదికగా జరిగిన మహానాడులో ప్రకటించడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి కౌంటర్ గా కేసీఆర్ టీడీపీ నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. సందర్భంగా కేసీఆర్ బాబు మాటలను ప్రధానంగా వ్యాఖ్యానించి దుమ్ముదులిపేశారు.

‘తెలంగాణ రైతులకు రూ.17వేల కోట్లతో రుణమాఫీ చేశాం.. అదే చంద్రబాబు.. ఆంధ్రా రైతులకు, డ్వాక్రా మహిళలకు శఠగోపం పెట్టి ఇంకా తెలంగాణ కు వచ్చి అధికారం వెలగబెడతాడట.. వచ్చి గెలుస్తాడట.. సిగ్గు లేకుండా వైజాగ్ మహానాడులో చెప్పుకున్నాడు..’ అని కేసీఆర్ మండిపడ్డారు.

మహానాడులో చంద్రబాబు తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పిన మరునాడే కేసీఆర్ బాబుకు షాక్ ఇచ్చారు. తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కు అయిన రమేశ్ రాథోడ్ ను టీఆర్ఎస్ లోకి చేర్చుకొని చంద్రబాబుకు అదిరిపోయే రీతిలో సమాధానమిచ్చారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదని హెచ్చరికలు పంపారు.

To Top

Send this to a friend