క్షమాపణలు చెప్పిన వివాదం వదిలేలా లేదు.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో వేడుక మొన్న వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఆ ఆడియో వేడుక సందర్బంగా యాంకర్‌ రవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు కాని అమ్మాయిలు పక్కలోకి పనికి వస్తారు అంటూ సీనియర్‌ నటుడు చలపతి రావు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతటి దుమారం రేపుతాయని ఆయన ఊహించి ఉండరు. ఇప్పుడు ఆయనపై ఏకంగా నిర్భయ కేసు నమోదు అయ్యింది.

 

ఆడవారిని కేవలం సెక్స్‌ కోసం అంటూ చూసే వారిని కఠినంగా శిక్షించాల్సిందే అని, అందుకే చలపతి రావు క్షమాపణలు చెప్పినా కూడా తాము ఊరుకునేది లేదు అంటూ మహిళ సంఘాల వారు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు చపతి రావుపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆయనపై నిర్బయ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు మరెవ్వరు చేసేందుకు సాహసం చేయకుండా చలపతి రావుకు శిక్ష పడే వరకు పోరాటం సాగిస్తామని మహిళ సంఘాల నాయకులు చెబుతున్నారు.

చలపతి రావు వ్యాఖ్యలపై మరో వైపు సినీ వర్గాల వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ నిర్మాత నాగార్జున సైతం ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. ఆయన వ్యాఖ్యలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తను వ్యక్తిగతంగా, సినిమాల్లో కూడా ఆడవారికి గౌరవం ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.

To Top

Send this to a friend