పోయి పోయి మహిళలతో పెట్టుకున్నాడు..

‘మహిళలు  ఆరోగ్యానికి హానికరం’ అనే డైలాగ్ కు స్పందనగా సీనియర్ తెలుగు నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అమ్మాయిలు పక్కలోకి అయితే పనికొస్తారు’ అని 60 ఏళ్ల సీనియర్ నటుడు చలపతిరావు రారండోయ్ వేడుక చేద్దాం సినిమా ఆడియో వేడుకలో అనడం వివాదాస్పదమైంది. మహిళల్ని ఇంత దిగజార్చిలా, కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన చలపతిరావుపై మహిళలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇంటా బయటా.. చానళ్లలో చలపతిరావును కడిగిపారేస్తున్నారు.

ఇలా సీనియర్ టాలీవుడ్ నటులు నోరేపారేసుకోవడం ఇదే తొలిసారి కాదు. అప్పట్లో ఓ ఆడియో ఫంక్షన్ లో హాస్యనటుడు అలీ అనుష్క తొడలపై కామెంట్లు చేసి బుక్కయ్యాడు. అనంతరం కూడా బుద్ది మార్చుకోలేదు.. సమంత నడుము.. బెంజ్ సర్కిల్ గా అందంగా ఉంటుందని కామెంట్ చేసి విమర్శలపాలయ్యాడు.

ఇక మన నటరత్న డైలాగ్ కింగ్ హీరో బాలయ్య ‘అమ్మాయిలకు ముద్దు అన్న ఇవ్వాలి.. లేదా కడుపు అయినా చేయాలి’ అని మహిళా లోకం నుంచి తీవ్ర విమర్శలు తెచ్చుకున్నారు. ఇలా తెలుగు సినీ సెలబ్రెటీలు ప్రతిసారి మహిళలపై నోరుజారుతూనే ఉన్నారు.

నటుడు చలపతి రావు.. మహిళల్ని ఆనకూడని మాట అని చిక్కుల్లో పడ్డాడు. పక్కలోకి మహిళలు పనికొస్తారు అన్న డైలాగ్ ఇప్పుడు చానల్స్ లో, సోషల్ లో మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. చలపతిరావును తిట్టనోళ్లు అంటూ లేరు. ఈ దుమారానికి స్వస్తి పలికాలని సారీ చెప్పినా కూడా ఎవ్వరూ ఆయన్ను క్షమించే పరిస్థితుల్లో లేరు. పోయిపోయి మహిళలతో పెట్టుకొని చలపతిరావు ప్రస్తుతం అష్టకష్టాలు పడుతున్నాడు.

To Top

Send this to a friend