చక్రపాణి కి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్


తెలుగు వారైనప్పటికీ ఒరియా చిత్రాలలో హీరోగా, ఒక వెలుగు వెలిగిన బహుభాషా నటులు చక్రపాణి ని ఒరియా ఫిలిం ఫెయిర్ వారు ఇటివల లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు తో ఘనంగా సత్కరించారు.1970,80 దశకాలలో తెలుగు, తమిళ, కన్నడ,ఒరియా భాషలలో వందకు పైగా చిత్రాలలో హీరోగా నటించిన చక్రపాణి ఒరియా భాషలో అగ్రశేణి హీరోగా వెలుగొందటం తెలుగు వారందరూ గర్వించదగిన విశేషం.ప్రముఖ నటిమణి రోజారమణి భర్త, ప్రముఖ హీరో తరుణ్ తండ్రీ అయిన చక్రపాణి ఒరియాలో హీరోగా అత్యున్నత స్థాయికి ఎదగటమే కాకుండా ఈటీవి..ఒరియా ఛానెల్ సి.ఇ.ఓ గా కూడా పని చేయటం విశేషం.ఒరియాలో పలుమార్లు ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్నచక్రపాణిని ఇటివల ఒరియా ఫిలిమ్ ఫెయిర్ వారు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ తో సత్కరించటమే కాకుండా ఇరవై అయిదు వేల రూపాయల నగదు బహుమతి కూడా అందజేసారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్రపాణి నేను అన్ని భాషలలో హీరోగా నటించినప్పటికీ ఒరియాలో ఒక టాప్ హీరో పోజిషన్ ను ఎంజాయ్ చేయటం చాలా ఆనందంగా,గర్వంగా అనిపిస్తుంది. ఒరియా ప్రజల మనస్సులలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నందుకు గుర్తుగా నన్ను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ తో సత్కరించిన ఒరియా ఫిలిమ్ ఫెయిర్ వారికి నా ధన్యవాదాలు అన్నారు.

To Top

Send this to a friend