వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

* వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లగా ఉండే నీడపట్టుకు చేర్చాలి.
* గాలి, వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో పడుకోపెట్టాలి.
*  చల్లటి దుస్తులు కప్పాలి. శరీరం వేడిగా ఉంటే తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి.
* ఉప్పు, పంచదార కలిపిన నీటిని గంట గంటకూ తాగించాలి.
*  కొందరికి వడదెబ్బ తగిలినప్పటికీ చెమట రాదు. ఇటువంటి వారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి.
* వాంతులు, విరేచనాలు అవుతున్నా వీలైనంత నీటిని తాగుతునే ఉండాలి.

ఇలా చేస్తే మేలు…
* ఉదయం గం. 9 నుంచి సాయంత్రం గం. 5 వరకు బయటకు వెళ్లక పోవడం మంచిది
* ఏవైనా పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లోనే చేసుకోవాలి.
* తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే నీడ పట్టునే సాగాలి
* ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్లు అరగంటకు ఓసారైనా చెట్టు నీడకు వెళ్లాలి
* బయటకు వేళ్లేవారు ముందుగా వీలైనంత ఎక్కువ నీటిని తాగాలి
* ఎండకు రక్షణగా గొడుగు, టోపీలు, హెల్మెట్‌ ధరించడం మంచిది
* వదులుగా ఉండే కాటన్‌ దుస్తులనే ధరించాలి
* ఉద్యోగులైన భార్యాభర్తలు ఇళ్లలోనే ఉండే వృద్ధులు, చిన్నారులకు నీటిని అందుబాటులో ఉంచాలి
* మూత్రం పచ్చరంగు నుంచి సాధారణ రంగుకు మారే వరకూ నీటిని తాగుతునే ఉండాలి
* మద్యం, కాఫీ, టీ, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌, స్పైసీఫుడ్‌లకు దూరంగా ఉండాలి
* ఉప్ప కలిపిన మజ్జిగ/నిమ్మరసం/కొబ్బరినీళ్లు/రాగి అంబలి నిత్యం తాగడం మంచిది.
* కీర, దోస, పుచ్చపండు తినడం లేదా వాటితో తయారు చేసిన జూస్‌లు తాగాలి
* బయటి నుంచి ఇంటికి రాగానే చన్నీళ్లతో స్నానం చేయాలి.
* స్నానం వీలు కాకుంటే ముఖం, కాళ్లు, చేతులను చల్లటి నీటితో కడుక్కొవాలి.   ర
* వీలైనన్ని సార్లు నీటిని తాగుతునే ఉండాలి
* ప్రిజ్‌ నీరు, ఐస్‌ క్యూబ్‌లు వేసిన నీటికి బదులు పరిశుభ్రమైన కుండ నీరు మంచిది
* బయటి నుంచి రాగానే నిమ్మకాయ రసంలో కొద్దిగా పంచదార, ఉప్పు వేసుకుని తాగాలి
* నీటిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా పంచదార కలిపిన మిశ్రమాన్ని కూడా సేవించవచ్చు

* ఇలా చేయకండి.. 
* రోడ్డు మీద అమ్మే ఆహార పదార్థాలు తినవద్దు
* అపరిశుభ్రమైన నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండండి
* కలుషితమైన నీటి వల్ల శరీరంలోకి బ్యాక్టీరియా చేరి డయేరియా రావచ్చు
* మాంసం, గుడ్డు నూనె తదితర పదార్థాల జోలికి వెళ్లొద్దు
* పాచిపోయిన అన్నం తినవద్దు. వేడిగా, తాజాగా ఉండే ఆహారాన్నే తీసుకోండి
* ఒళ్లు వేడిగా ఉన్నా, వాంతులు విరేచనాలైనా, గొంతు నొప్పి అనిపించినా తక్షణమే * వైద్యుణ్ణి సంప్రదించాలి
* జ్వరం వచ్చి తగ్గుతుంటే డాక్టర్ల సలహా మేరకు రక్త పరీక్షలు చేయించుకోవాలి
* అంటు వ్యాధులు సోకిన వారికి దూరంగా ఉండాలి
* ఫ్రిజ్‌లలో రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకండి

To Top

Send this to a friend