ఆధార్-పాన్ లేకుండా రూ.50వేలు కూడా బ్యాంకులో వేయలేవు..


జూన్ 1 నుంచి ఆర్బీఐ, కేంద్ర రెవెన్యూశాఖ నిబంధనలను పూర్తిగా మార్చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక నుంచి రూ.50వేలకు మించి నగదు లావాదేవీలు జరిపే వ్యక్తులు, సంస్థలు, పాన్ తో పాటు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. లేకపోతే ఆ డబ్బులపై జరిమానాలు, ఐటీ విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం , బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి..

అంతేకాదు జూన్ 1 తర్వాత బ్యాంకులో ఖాతాలున్న వారు పాన్ కార్డుతో పాటు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే వారి లావాదేవీలు జరగవు. కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచినా ఆధార్ ను , పాన్ కలిపి దరఖాస్తు చేయాల్సిందేనని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.

అక్రమ ద్రవ్య చెలామణీపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా ఉంచడం లో భాగంగా.. నల్లధనం అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ మార్పుల వల్ల సామాన్యులు, పెళ్లిళ్లు జరిపే మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే.. ఎందుకంటే పాన్ కార్డు గ్రామాల్లో ఎవ్వరికీ ఉండవు. పాన్-ఆధార్ కలిసి ఇస్తేనే రూ.50వేలకు మించి లావాదేవీల నిబంధన ఇప్పుడు ప్రజలపై పెనుభారాన్ని మోపుతోంది.

To Top

Send this to a friend