తెలంగాణలో కాల్ మనీ రాకెట్..!

ఏపీలో పేదల రక్తం పీల్చిన కాల్ మనీ రాకెట్ తెలంగాణలోనూ జడలు విప్పింది. గద్వాల జిల్లాలో వెయ్యికోట్ల దందా బయటపడింది. రూ.5 నుంచి 10, 15 వరకు వడ్డీ వసూలు చేసిన ఫైనాన్స్ వ్యాపారుల ఆట కట్టు అయ్యింది. అక్రమంగా కోట్లు సంపాదిస్తున్న కాల్ మనీ వ్యాపారులను ఒక బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

జోగులాంభ గద్వాల జిల్లాలో ఓ వ్యాపారి వద్ద ఒక వ్యక్తి 10 లక్షలు ఐదు రూపాయల వడ్డీకి తీసుకున్నాడు. ప్రతి నెల 50 వేల వడ్డీ చెల్లించాడు. ఇలా మూడేళ్లకే 18లక్షల వడ్డీ కట్టాడు. ఈ మధ్య కట్టకపోవడంతో సదురు వ్యాపారి గుండాలతో వచ్చి వ్యక్తిని, ఆ ఇంట్లోని మహిళలపై దౌర్జన్యం చేశాడు. విసిగి వేసారిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీగ లాగితే 1000 కోట్ల కాల్ మనీ రాకెట్ వెలుగుచూసింది..

గద్వాల కేంద్రం వడ్డీ వ్యాపారులు కాల్ మనీ రాకెట్ నడుపుతున్నారు. అడిగితే కోటి రూపాయల వరకు కూడా తక్షణం డబ్బు సర్ధుబాటు చేయడం ఈ వ్యాపారుల ప్రత్యేకత.. రోడ్ల పక్కన బండి వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు నూటికి రూ.5 నుంచి 15 వరకు వడ్డీకి అప్పు ఇస్తారు. ఇందుకోసం ప్రామిసరీ నోట్లు, ఇళ్లు, ఫ్లాట్లు, భూముల దస్త్రాలను తమ వద్ద తనఖా పెట్టుకుంటారు.. గుండాలను పెట్టుకొని ప్రతి నెల వడ్డీ వసూలు చేయిస్తారు. కట్టకపోతే ఆస్తులు లాక్కుంటారు. ఇలా ఒక వ్యక్తి ని బెదిరించగా అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురు వ్యాపారులను అరెస్ట్ చేసి 11 కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

To Top

Send this to a friend