మధ్యలో ఉన్నోళ్లు తినకుండా బీజేపీ ‘టీవీ’ప్లాన్


హైదరాబాద్ జనాభా దాదాపు 80లక్షలు.. కరీంనగర్ పట్టణ జనాభా దాదాపు 3 లక్షలు.. తెలంగాణలో మొత్తం కుటుంబాలు 80లక్షలు. ఎంతలేదన్న ఇందులో కేబుల్ టీవీ డిష్ ఉన్నవారు 50 లక్షల మంది ఉంటారు. ఒక్కో డిష్ టీవీ కనెక్షన్ కు 20 నుంచి 300 రూపాయలు తీసుకుంటారు. ఇందులో ప్రభుత్వానికి సేవా పన్ను రూపంలో దాదాపు 20శాతంలోపు చేరాలి. కానీ ఎక్కడా చేరడం లేదు. మధ్యలో ఉన్న డిష్ కేబుల్ నిర్వాహకులు కనెక్షన్లను తక్కువగా చూపిస్తున్నారు. 3 లక్షల మంది ఉంటే లక్ష మందే డిష్ వాడుతున్నట్టు చూపిస్తున్నారు. దానికే పన్ను కడుతున్నారు. మిగతా 2 లక్షల కుటుంబాల పన్నును జేబులో వేసుకుంటూ మధ్యలో ఉన్నవారు లాభపడుతున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి చేరాల్సిన సేవా పన్ను అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి చేరకుండా మధ్యలో డిష్ లు నిర్వహిస్తున్న నిర్వాహకులకు చేరుతోంది. వారు కోట్లకు పడగలెత్తుతున్నారు.

అందుకే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పన్నుల చట్టాలను సమూలంగా మార్చేస్తోంది. జీఎస్టీ అమలు వల్ల పన్నులు ముక్కుపిండి వసూలవుతాయి. తద్వార దేశ ఆదాయం పెరిగి ప్రజలకు సంక్షేమ పథకాలు మరిన్ని అందుతాయి. ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ఇప్పుడు కొత్త పన్నులు, విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది.

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ పన్నుల సరళీకరణలో ముందుంది. ఇప్పటికే డిజిటల్ ప్రసారాలను దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన కేంద్రం డిజిటెల్ సెట్ బాక్సులను అందరూ పెట్టుకునేలా చేసింది. ఇప్పుడు స్మార్ట్ కార్డులను తప్పనిసరి చేసింది. ఈ సార్ట్ కార్డులు పెట్టుకుంటేనే డిష్ కేబుల్ ప్రసారాలు అవుతాయి. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ కార్డుల గోల మొదలైంది. స్మార్ట్ కార్డులు పెట్టుకుంటేనే చానల్స్ ప్రసారం అవుతాయని టీవీల్లో వస్తోంది. దీంతో వినియోగదారులు కేబుల్ టీవీ ఆపరేటర్లను సంప్రదిస్తున్నారు..

ఈ స్మార్ట్ కార్డులతో ఆధార్ ను అనుసంధానం చేస్తున్నారు. అంటే నగరాల్లో ఎంత మంది వినియోగదారులున్నారు. వారు పన్ను చెల్లిస్తున్నారా.? కేబుల్ నిర్వాహకులే కొట్టేస్తున్నారా అనేది ఈ స్మార్ట్ కార్డుల ద్వారా తెలుస్తుంది. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా డిష్ టీవీ వాడే వారందరి నుంచి పన్ను కేంద్రానికి చేరుతుందన్నమాట.. ఇలా మధ్యలో నిర్వాహకులు తినకుండా కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వానికి పన్ను, వినియోగదారులకు హెచ్.డీ ప్రసారాలు అందుతాయి. మధ్యలో కేబుల్ నిర్వహించేవారికి అక్రమ సొమ్ము పోకుండా ఉంటుంది.

To Top

Send this to a friend