బస్సుల లొల్లి.. ఏపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది..


స్లీపర్ కోచ్ బస్సులు ఏపీలో సరిపడా లేవంటూ ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ బస్సులను అనుమతివ్వడంపై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడి తీరుపై ఘాటైన విమర్శలు చేశారు. ఇతర రాష్ట్రాల బస్సులను అనుమతిస్తూ మంత్రులు డబ్బులు గుంజుతున్నారని మండిపడ్డారు. ఇలా ఓ టీడీపీ ఎంపీ.. టీడీపీ మంత్రిపై విమర్శలు చేయడం దుమారం రేపింది.

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ లైసెన్సుల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం, మంత్రుల హస్తం ఉందని ఇటీవలే ఎంపీ, ట్రావెల్స్ ఓనర్ అయిన కేశినేని నాని ఆరోపించిన సంగతి తెలిసిందే.. దీనికి ధీటుగా సమాధానమిచ్చిన రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడిపై ఈరోజు నాని మరోసారి విరుచుకుపడ్డారు.

ప్రజల సౌకర్యం పేరుతో ఇతర రాష్ట్రాల బస్సులను అనుమతించడం.. ఇక్కడి వారిని అణగదొక్కడమేనన్నారు. ఇలాగే ప్రజలకు ఇబ్బందులున్నాయని.. వ్యభిచార గృహాలకు అనుమతులు, పేకాట క్లబ్ లకు పర్మిషన్లు ఇస్తారా అని మంత్రి అచ్చెన్నాయుడిని ఎంపీ నాని కడిగేశారు. దీంతో మరోసారి బస్సుల లొల్లి ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

To Top

Send this to a friend