అంకితం ఇచ్చి టచ్‌ చేసిన బన్నీ


అల్లు అర్జున్‌ తాజాగా ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ యాక్టర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డును దర్శకరత్న దాసరి నారాయణ రావుకు అంకితం ఇస్తున్నట్లుగా వేదిక మీదే అల్లు అర్జున్‌ ప్రకటించాడు. ఆయనతో తనకున్న అభిమానంను కనబర్చాడు. గతంలో మెగా ఫ్యామిలీతో దాసరి నారాయణ రావుకు విభేదాలు ఉండేవి. అయితే చనిపోయే ముందు మాత్రం ఆ వివాదం కాస్త సర్దుమణిగింది.

ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మెగా ఫ్యామిలీ ఆయన్ను ఓన్‌ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్‌ ఇలా తన అవార్డును అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించాడని అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ చాలా తెలివిగా దాసరి గురించి మాట్లాడి మరియు తన అవార్డు అంకితం ఇచ్చి సినీ వర్గాల్లో మరియు దాసరి అభిమానుల్లో మంచి పేరును దక్కించుకున్నాడు.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రెండు నిమిషాల మౌనం పాటించాల్సిందిగా అల్లు అర్జున్‌ కోరాడు. అందుకు అంతా కూడా నిల్చుని దాసరి నారాయణరావు మరణంకు శ్రద్దాలి ఘటించారు. అల్లు అర్జున్‌ టచ్‌ చేసేలా చేశాడని, నిజంగానే ఉత్తమ హీరో అనిపించుకున్నాడని మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు.

To Top

Send this to a friend