రాజకీయ లూప్ హోల్స్ పై బన్నీ ఎక్కుపెట్టిన అస్త్రం..

అల్లు అర్జున్.. ఓటమెరుగని హీరో. బన్నీ సినిమా ఒప్పుకున్నాడంటే అందులో ఏదో ఒక సంచలనం ఉండి తీరాల్సిందే.. అందుకే ఇప్పుడు హిట్ హీరోల జాబితాలో బన్నీ మొదటిస్థానంలో నిలిచిపోయాడు. ఇప్పుడు వక్కంతం వంశీ చెప్పిన కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అతడినే దర్శకుడిగా పరిచయం చేస్తుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వక్కతం రాజకీయాలపై విసరబోతున్న అత్యంత బలమైన కథను అల్లు అర్జున్ కోసం వినిపించడాడట.. ఇది విన్న అల్లు అర్జున్, అరవింద్ లు వక్కతంకే తొలి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా రాజకీయాలపై బన్నీ వేసే అస్త్రం ఎలా గుండబోతుందనే ఆసక్తి అందిరలోనూ నెలకొంది.

ప్రస్తుతం దువ్వాడ జగన్నాథమ్ సినిమా కోసం పనిచేస్తున్న బన్నీ ఈ సినిమా విడుదలయ్యాక జూలై నుంచి వక్కతం సినిమాలో నటించనున్నాడు. వక్కంతం సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా కోసం వక్కంతం ఎంతటి ట్విస్ట్ కథ రాశాడోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది..

సినిమా కథ అద్భుతంగా రావడంతో హిట్ పక్కా అని అల్లు అర్జున్ నమ్మకంతో ఉన్నాడట.. అందుకే ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావాల్సిందిగా తన చిన్నమామ, మెగా బ్రదర్ నాగబాబును కోరాడు. ఇప్పటికే సినిమాలు తీసి పీకల్లోతు అప్పుల్లో ఉన్న నాగబాబును నా పేరు సూర్య సినిమాతో గట్టేక్కించాలనే బన్నీ నాగబాబును నిర్మాతగా మల్లీ తెరమీదకు తెచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సరేనని లగడపాటి శ్రీధర్, బన్నీవాసులతో పాటు నాగబాబు బన్నీ సినిమాకు నిర్మాతగా మారారు.

To Top

Send this to a friend