తెలుగు సినిమా కి కొత్త కధల్ని పరిచయం చేస్తూ తన డైన శైలిలో ముందుకు వెళ్తున్న సుకుమార్ మరోమారు విభిన్న ప్రయోగానికి రెడీ అవుతున్నాడు.ఆర్యా చిత్రం తో ప్రారంభమైన సుకుమార్ సినీ పయనం తెలుగు సినీ యవనిక ఫై తనదైన ముద్రని చూపిస్తోంది.ఆ క్రమంలో వచ్చిన 100 % లవ్ , నాన్నకు ప్రేమతో , రంగస్థలం వంటి చిత్రాలు సుకుమార్ క్రియేటివిటీ కి దర్పణాలుగా నిలిచాయి. భిన్నమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని ఒకింత ఆశ్చర్య పరిచే సుకుమార్ చిత్రాలు నేటి తరానికి బాగా నచ్చుతుండటం తో సుకుమార్ తన మేధకు మరింత పదును పెడుతూ సినిమాల్ని తీస్తున్నాడు. ఆ క్రమంలోనే రాబోయే చిత్రం లో అల్లు అర్జున్ కి కొత్త రూపు రేఖలు ఇవ్వబోతున్నాడు. బన్నీ లోని నటుడికి పరీక్షగా నిలిచే విధంగా రెండువిభిన్న పాత్రల్లోబన్నీ ని చూపించ బోతున్నాడు. ఒక పక్క లారీ డ్రైవర్ గా , మరో పక్క ఆఫీసర్ గా రెండు కోణాల్లో బన్నీ నట విశ్వరూప ప్రతీకగా ఈ చిత్రం రూపు దిద్దుకొంటోంది.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్న ఈ చిత్రం లో లక్కీ లేడీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తూ ఉండటం తో ఈ చిత్రం ఫై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సుకుమార్ కి అచ్చివచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరో మారు ఈ చిత్రం ద్వారా తన సత్తా చాట బోతున్నాడు.
