బడ్జెట్ పెరిగింది..

ఇదంతా బాహుబలి మాయ..
బాహుబలి సినిమాకు కథనందించిన రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరోసారి అలాంటి చారిత్రక కథను అందించాడట.. ప్రస్తుతం స్పైడర్ సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్న మురగదాస్ ఈ సినిమా పూర్తి కాగానే తమిళ అగ్రహీరో విజయ్ తో కలిసి ఈ సినిమా తీస్తాడని సమారం. ఈనెల 120 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నాట.. ఈ సినిమాను రోబో తీసిన సన్ పిక్చర్స్ సంస్త నిర్మిస్తోంది.

దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో బాహుబలి లాంటి చారిత్రక అంశంతో పాటు సామాజిక అంశాలు మేలవించేలా కథను రూపొందించారట.. మురగదాస్ మార్క్ సోషల్ ఎలిమెంట్ తో పాటు విజయ్ స్టైల్ కమర్షియల్ ఎలిమెంట్ ను కథలో విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారట.. ఇప్పటికే తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన విజయ్-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై దక్షిణాదిలో భారీ హైప్ నెలకొంది..

దక్షిణాదిలో 100 కోట్ల బడ్జెట్ పైచిలుకు సినిమాలు పెరిగిపోయాయి. మోహన్ లాల్ 1000 కోట్లతో మహాభారతం తీస్తుండగా.. అల్లు అరవింద్ 500 కోట్ల బడ్జెట్ తో రామాయణం తీస్తానని ప్రకటించారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆ ఒరవడి కొనసాగి 120 కోట్లతో మురగదాస్ సినిమాను తీస్తుండడంతో సినిమా స్థాయి పెరిగిందనే చెప్పవచ్చు. ఇదంతా బాహుబలి సినిమా మహత్య్మమే అనడంలో సందేహం లేదని సినీ క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు.

To Top

Send this to a friend