బ్రేకింగ్ న్యూస్..

అగ్రదర్శకులు.. అగ్ర హీరోల హీరోయిన్ గా పేరు సంపాదించిన ఐశ్వర్యరాయ్ కి అరుదైన అవకాశం దక్కింది. రోబో సినిమాతో రజినీకాంత్ సరసన మెరిసిన ఐశ్వర్య ఆ తరువాత తల్లిగా మారి సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు అగ్రహీరో చిరంజీవి పక్కన నటించే అవకాశం ఐశ్వర్యకు దక్కింది.

చారిత్రక గాథలకు డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులో బాహుబలి ప్రభంజనంతో మొదలైన ఈ ఒరవడిని చిరంజీవి కూడా కొనసాగించేందుకు రెడీ అయ్యారు. చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక తన 151వ చిత్రంగా చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నారు. చరిత్రదాచిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడీ కథా సిద్ధమవుతోంది. పరుచూరి బ్రదర్స్ తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో చారిత్రక నేపథ్యమున్న కథలో నటించడానికి ఐశ్వర్యను ఓకే చేసుకున్నారట ‘ఉయ్యాలవాడ’ దర్శకుడు సురేందర్ రెడ్డి. ఐశ్వర్యను ఒప్పించే బాధ్యతను బాలీవుడ్ తో సన్నిహిత సంబంధాలున్న రాంచరణ్ కు అప్పజెప్పారట చిరంజీవి.. దీంతో స్వయంగా ఉయ్యాల వాడ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రాంచరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి  ముంబై వెళ్లి ఐశ్వర్యను కలిసినట్టు సమాచారం.ఆమెకు కథను వినిపించినట్టు తెలిసింది. ఆమె అంగీకారం తెలిపితే ఉయ్యాలవాడ హీరోయిన్ గా ఐశ్వర్య నటించడం ఖాయం..

To Top

Send this to a friend