నేను హీరోనంటూ అమ్మాయితో చెడుగా ..!

ఒకటి రెండు సినిమాల్లో నటించగానే సక్సెస్‌ వచ్చినా రాకున్నా తామో పెద్ద సెబ్రెటీగా కొందరు ఫీల్‌ అవుతూ ఉంటారు. తామంటే అమ్మాయిలు పిచ్చి ఎక్కి పోతారు అని, తమను కలిసేందుకు ఒక్క సెల్ఫీ తీసుకునేందుకు అమ్మాయిలు క్యూ కడుతుంటారు, వారిని ఏం చేసినా కూడా వారు సంతోషిస్తారు అని కొందరు హీరోలు ఫీల్‌ అవుతుంటారు. స్టార్‌ హీరోల సంగతి పక్కన పెడితే చిన్న హీరోలు కాస్త అతి చేస్తూ ఉంటారు.

తాజాగా ముంబయిలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని చెప్పకనే చెబుతుంది. వివరాల్లోకి వెళ్తే ధోని సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న యువ బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తాజాగా ఒక పబ్‌లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి కాస్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం కాస్త జాతీయ మీడియా వరకు వెళ్లింది. పోలీసులు కాంప్రమైజ్‌ చేసేందుకు ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. కాని అప్పటికే ఒక జాతీయ మీడియాకు ఈ విషయం లీక్‌ అయ్యింది.

గత వీకెండ్‌లో సుశాంత్‌ ఒక పబ్‌లో బాగా తాగి అదే పబ్‌లో స్నేహితులతో ఒక బర్త్‌డే పార్టీకి వచ్చిన అమ్మాయి చేయి పట్టుకున్నాడట. తానో హీరోను అంటూ, తాను చేసిన సినిమాల గురించి చెబుతూ ఆమెను ఎక్కడ పడితే అక్కడ టచ్‌ చేశాడట. దాంతో ఆమె అసహనంతో దూరంగా నెట్టేసి పోలీసులకు ఫోన్‌ చేసింది. దాంతో పోలీసులు రావడం మాట్లాడి కాంప్రమైజ్‌ చేశారు. ఈ విషయం అక్కడ ఉన్న కొందరి కారణంగా మీడియాకు చేరింది. ఈ విషయంపై స్పందించేందుకు సుశాంత్‌ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఆమె ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు.

To Top

Send this to a friend