పడవల వ్యాపారం పెట్టుకుంటే బతికేయొచ్చు..

Hyderabad: A bus splashes drives past a flooded street in the rain in Hyderabad on Friday. PTI Photo (PTI9_16_2016_000372B)

నీరు ఇంకడానికి భూమి లేదు.. అంతా కాంక్రీట్ జంగల్.. చుక్క చుక్క నీరు కలిసి ప్రవాహంలా మారి ఇళ్లను ముంచేస్తోంది. హైదరాబాద్ లో వాన పడిందంటే చాలు జనం భయపడుతున్నారు. రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నాయి. ముంపు కాలనీలన్నీ జలమయం అవుతున్నాయి.

నైరుతి పలకరింపు వేళ.. ముందస్తు వానలు హైదరాబాద్ ను పలకరించాయి. రాత్రి వేళ రెండు మూడు గంటల వాన పడింది. అంతే హైదరాబాద్ దిగ్భంధమైపోయింది. నీటితో రోడ్లన్నీ నిండి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, ప్రజలు తమ పనులన్నీ బంద్ చేసి ఇంట్లోనే ఉండిపోయారు. ఇక ముంపు ప్రాంతాల్లోని కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాలు లోతు నీరు చేరి జనం నరకం అనుభవిస్తున్నారు. ఏం వండుకోకుండా.. తినకుండా అష్టకష్టాలు పడుతున్నారు.

ఇప్పుడు హైదరాబాద్ లో ఏ బిజినెస్ పెట్టుకున్నా నడుస్తుందో లేదో తెలియదు కానీ.. ఈ వానాకాలంలో నాలుగు పడవలు కొనుక్కుంటే బాగా నడుస్తుందని.. సెటైర్లు వినిపిస్తున్నాయి. పడవలతో జనాన్ని ,.. సామాన్లు తరలించడం.. ముంపు కాలనీల్లోంచి ఈజీగా పనులకు వెళ్లడం ఈ కాలంలో చాలా సులువు. అందుకే పడవల వ్యాపారస్థులు జర ఈ వానాకాలంలో హైదరాబాద్ లో వ్యాపారం పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

To Top

Send this to a friend