బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఓ ఆన్లైన్ గేమ్. దీన్ని రిజిస్టర్ చేసుకున్నవాళ్లు 50 రోజల పాటు ఏదో ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. చేససిన ప్రతి టాస్క్‌కు వీడియో సహిత ఆధారాలను చూపించాల్సిఉంటుంది. గేమ్ ప్రారంభంలో చిన్న చిన్న టాస్క్‌లే ఇస్తారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వికృతమైన ఆదేశాలు జారీ చేస్తారు. తెల్లవారుజామునే భయానక వీడియోలు చూడమని, చేతులు, చేతిమీద కోసుకోమని.. రకరకాల టాస్క్‌లు ఇస్తారు. అలా ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటారు.
చివరికి 50వరోజు వచ్చేసరికి చనిపోమని గేమ్ మనల్ని ఆదేశిస్తుంది. అప్పటికే మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకుంటారు. 2013లో రష్యాలో మొదలైన ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. క్రమంగా యూరప్, అమెరికా, ఆసియాలకు విస్తరించింది. ఇప్పటివరకు వందల మంది యువత ఈ గేమ్‌కు బలైపోయారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వాలు నిషేధించినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
