బీజేపీ లోకి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి..

నాయకులు కావాల్సిందే.. ఎలాగైనా దక్షిణాదిలో పాగా వేసేందుకు మెరుగైన నాయకులు కావాలి.. తెలంగాణలో ఓ మోస్తారుగా ఉన్న పార్టీకి జవసత్వాలు నింపేందుకు నాయకులను వెతికే పనిలో పడిందట బీజేపీ అధిష్టానం.. అందుకోసం ఓ టీడీపీ సీనియర్ నేతను, కాంగ్రెస్ లో కీలకపాత్ర పోషించిన రెడ్డి బ్రదర్స్ ను ఆహ్వానించి నాయకత్వం అప్పజెప్పేందుకు సంప్రదిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి..

ఉత్తరాది విజయంతో ఊపుమీదున్న బీజేపీ తెలంగాణపై కన్నేసింది.. కమలం యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నా ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారన్నది ఇప్పుడు లెటెస్ట్ న్యూస్. రాష్ట్రంలో కమలదళ నేతలు వారి ప్రయత్నాలకు మోకాలడ్డుతున్నా మధ్యవర్తుల ద్వారా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కోసం కూడికలు , తీసివేతలు అపుడే మొదలు పెట్టాయి పార్టీలు.. ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన బీజేపీ, అందుకోసం పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఆపరేషన్ సెవెన్ స్టేట్స్ లో భాగంగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీస్తోంది. వచ్చే నెల చివరి వారంలో కమల దళపతి అమిత్ షా తెలంగాణాలో మూడు రోజులు పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనతో నేరుగా కలిసేందుకు టీడీపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి బిజేపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో కలిసి అమిత్ షాతో మాట్లాడినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తాజగా కోమటి రెడ్డి బ్రదర్స్ సైతం కమలం పార్టీలో చేరడానికి మధ్య వర్తి కోసం వెతుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ముఖ్యనేతలు ఎవ్వరూ ఇతర పార్టీల నుంచి వచ్చే ముఖ్యనేతలకు అవకాశమివ్వకపోవడంతో కమలంపార్టీ పై ఆసక్తి ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌ నేతలంతా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షా మీదనే ఆశలు పెట్టుకొని బీజేపీలో చేరినా రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో లేదో అనే అనుమానం కూడా ఆ నేతలను వేధిస్తోంది. కానీ లేటెస్ట్ గా రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ బాధ్యతలు అప్పజెప్పవచ్చనే ఊహాగానాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. రేవంత్ ను పెట్టి కేసీఆర్ ను ఓడించాలనే బీజేపీ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో చూడాలి.

To Top

Send this to a friend