ముద్దిచ్చి దొరికిపోయిన బీజేపీ నేత..

బీజేపీ నేత ముద్దుచ్చి అడ్డంగా దొరికిపోయాడు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పబ్లిగ్గా బస్సులో అందరూ చూస్తుండగానే కదులుతున్న బస్సులో ఓ మహిళకు ముద్దు ఇచ్చి దొరికిపోయాడు బీజేపీ లీడర్.. ముంబైకి చెందిన బీజేపీ నేత రవీంద్ర బవన్ థాడే గడ్చిరోలీ జిల్లాలోని చందాపూర్ ప్రాంతంలో బస్సులో వెళుతున్నాడు. సడన్ గా బస్సులో ఓ మహిళకు ముద్దు పెడుతూ దొరికిపోయాడు.

వెనుకాల సీట్లో ఉన్న ప్రయాణికుడు ఒకరు ఈ ముద్దు సన్నివేశాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగు చూసింది.. బీజేపీ లీడర్ ముద్దు ముచ్చట వెలుగుచూడడంతో వైరల్ మారింది. సదురు బీజేపీ నేత రవీంద్రకు ఆ మహిళతో ఇంతకుముందే పరిచయం ఉన్నట్టు సమాచారం. ఆమె ఉద్యోగం ఇస్తానని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని.. అనంతరం అవి నెరవేర్చక నాన్చుతున్నాడని తెలిసింది.

ముద్దిచ్చిన బీజేపీ నేత వ్యవహారం వెలుగుచూడడంతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. సదురు మహిళ బీజేపీ నేత రవీంద్రపై రేప్ కేస్ పెట్టింది. కేసు పెట్టగానే రవీంద్ర కనిపించకుండా పోయారు. బీజేపీ నేత ఇలా చేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం మహారాష్ట ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.

బీజేపీ నేత ఓ మహిళకు ముద్దు ఇచ్చిన కింద వీడియోలో చూడొచ్చు..

 

To Top

Send this to a friend