బీజేపీ మోసం.. రాష్ట్రపతిగా..


గుజరాతీ ద్వయం నరేంద్రమోడీ, అమిత్ షాలు బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అడ్వాణీని దారుణంగా మోసం చేశారు. ప్రధాని పీఠం మోడీ చేపట్టేముందు ఆయన్ను వ్యతిరేకించిన అడ్వాణీని అప్పట్లో రాష్ట్రపతిని చేస్తామని బీజేపీ నేతలు, మోడీ హామీ ఇచ్చారు. అప్పట్లో గుజరాత్ లో ఓ దేవాలయం లో కూడా రాష్ట్రపతిగా అడ్వాణీనే చేస్తామని మోడీ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆయన్ను దారుణంగా ముంచేశారు. బీజేపీ కురువృద్ధుడికి బీజేపీలో ఇప్పుడు చోటే లేకుండా చేశారు.

భారతీయ జనతాపార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది అంటే అది ఖచ్చితంగా మాజీ ప్రధాని వాజ్ పేయి, బీజేపీ అగ్రనేతలు పడిన కష్టమే.. ఆ తర్వాత నరేంద్రమోడీ తన స్టామినాతో దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ నేడు ఆ సీనియర్లకే బీజేపీలో చోటు లేకుండా పోయింది. గుజరాత్ ద్వయం ధాటికి వాజ్ పేయి నామస్మరణపోయి మోడీ భజన మొదలైందని బీజేపీలోని అసంతృప్తి వర్గాలు మథనపడుతున్నాయి.. యాక్టివ్ గా ఉన్న ఎల్.కే అడ్వాణీని రాష్ట్రపతిని చేస్తామని హామీ ఇచ్చిన మోడీ-షాలు ఇప్పుడు బాబ్రీ కేసుల్లో ఇరికించి ఆయన్ను జైలు పాలు చేసేందుకు రెడీగా ఉన్నారని అడ్వాణీ అభిమానులు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రపతిగా అడ్వాణీ ఉంటే తనకు చిక్కులు ఎదురవుతాయని ఊహించిన మోడీ-షాలు చాకచక్యంగా ఆయన్ను తప్పించారు. బాబ్రీ కేసుల్లో ఇరికించారు. ఇప్పుడాయన పేరునే ఎవరూ ప్రకటించకుండా చేశారు. అడ్వాణీ స్థానంలో బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ కోవింద్ ను ఎన్టీఏ తన రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. దళిత నేతను బీజేపీ రాష్ట్రపతిగా ఖరారు చేసింది. రామ్ నాథ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్. బీజేపీ దళిత మోర్చా నాయకుడిగా ఆయన చేశారు. రాజ్యసభ ఎంపీగా 12 ఏళ్ల పాటు చేశారు. కోవింద్ రాష్ట్రపతిగా ఖాయం చేయడంతో ఇక అడ్వాణీ శకం బీజేపీలో ముగిసినట్టే..

To Top

Send this to a friend