పోరు లాభం.. పొత్తు నష్టం..

2019 రాజకీయాలకు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. అమిత్ షా తెలంగాణ పర్యటనతో ఆ విషయం స్పష్టమైంది. తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగుతున్నట్టు అమిత్ షా ప్రకటించారు. అలాగే ఏపీలో మాత్రం పొత్తు పొడుపులపై తేల్చలేదు. ఏపీలో చంద్రబాబుతోనే వెళతారని టీడీపీ వర్గాలు.., వైసీపీతోనే వస్తారని జగన్ అండ్ కోలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఏ విషయం తేల్చకుండా అమిత్ షా సస్పెన్స్ లో పెట్టాడు.

రాష్ట్రపతి ఎన్నికల వరకు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో స్నేహంగా ఉండాలని అమిత్ షా బీజేపీ నేతలకు హితబోద చేశాడట.. రాష్ర్టపతి ఎన్నికల తర్వాత దక్షిణ భారతదేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారబోతున్నాయని అమిత్ షా.. బీజేపీ నేతలకు చెప్పినట్టు సమాచారం.  ఆ తర్వాత తమాషా చూడండని చెప్పాడట.. 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఒంటరిగా అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పినట్టు తెలిసింది.

దక్షిణాదిలో రాష్ట్రపతి ఎన్నికల తర్వాత బీజేపీ బలపడేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ మద్దతు తీసుకొని గెలిచాక.. దక్షిణాదిలో ఈ పార్టీ ల నుంచి పెద్ద ఎత్తున నాయకులను లాగి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో అమిత్ షా ఉన్నట్టు తెలిసింది. అందుకే ఇప్పుడే అమిత్ షా పర్యటనలో చేరాల్సిన కాంగ్రెస్, టీఆర్ఎస్ అసంతృప్త నాయకులు.., కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్లను ఎవ్వరినీ చేర్చుకోకపోవడానికి ఇదే కారణమట… రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తమిళనాట ఉపయోగించిన పన్నీర్ సెల్వం ఫార్ములాను ఏపీ, తెలంగాణలో ప్రయోగించాలని అమిత్ డిసైడ్ అయినట్టు సమాచారం.

To Top

Send this to a friend