బిత్తిరి సత్తి ఇక కనిపించడా?

తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి కూడా బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ న్యూస్‌ ఛానెల్‌ వి6లో తీన్మార్‌ వార్తల ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన చేవెల్ల రవి అలియాస్‌ బిత్తిరి సత్తి మనలో ఒకడు అన్న పేరును తెచ్చుకున్నాడు. తీన్మార్‌ వార్తల్లో ఆయన వచ్చేది కేవలం అయిదు నిమిషాలే అయినా కూడా అందుకోసం ఎంతో మంది ఎదురు చూస్తారు అని చెప్పుకోవచ్చు.

-sathiగత కొన్ని సంవత్సరాలుగా బిత్తిరి సత్తి వి6 ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల ఈయన కొన్ని ముఖ్య కార్యక్రమాలను, సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేయడం కూడా జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులకు రోజు రోజుకు దగ్గర అవుతున్న బిత్తిరి సత్తి హఠాత్తుగా వి6 న్యూస్‌లో కనిపించకుండా పోయాడు. నిన్న ప్రసారం అయిన తీన్మార్‌ వార్తల్లో బిత్తిరి సత్తి ఎందుకు రాలేదు అంటూ ప్రస్తుతం సత్తి అభిమానులు ఆలోచనలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తీన్మార్‌ వార్తలకు అవార్డును ఇవ్వబోతుంది. అందుకోసం ఏదైనా కార్యక్రమ నిర్వహణకు సత్తి నిన్నటి వార్తల్లో రాలేదా, లేదంటే మరే ఇతర కారణం వల్ల అయినా కూడా తీన్మార్‌ను బిత్తిరి సత్తి వదిలేశాడా అనేది చూడాలి. నేడు బిత్తిరి సత్తి తీన్మార్‌లో కనిపించకుంటే ఇక సత్తి వి6 కు గుడ్‌బై చెప్పినట్లే అని భావించవచ్చు.

To Top

Send this to a friend