బర్త్ డే నాడే అభిమానులకు పండుగ


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. తమిళ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మహేష్ బాబు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదట మహేష్ తన స్పైడర్ సినిమా జూన్ 23న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల విడుదల తేదిని వాయిదా వేశారు.

ఇప్పుడు మహేష్  బర్త్ డే ఆగస్టు 9ని పురస్కరించుకొని తన అభిమానులకు కానుక ఇవ్వాలని మహేష్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఆ రోజునే స్పైడర్ ను రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. హరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించనున్నట్టు తెలిసింది. మే నెలాఖరు వరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు గన్ తో నిలుచున్న ఫస్ట్ లుక్ కి అదిరిపోయే స్పందన వస్తోంది. జూన్ లో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

To Top

Send this to a friend