అతడికోసం కోహ్లీ ఇంత పెద్ద స్కెచా.?


భారత క్రికెట్ జట్టు కోచ్ గా అనిల్ కుంబ్లే రావడం తొలినుంచే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇష్టం లేదా..? అందుకే ఆరు నెలలుగా వారు మాట్లాడుకోవడం లేదా.? కుంబ్లేను సాగనంపి ఆ స్థానంలో పాత డైరెక్టర్ రవిశాస్త్రిని తెచ్చుకోవడానికి కోహ్లీ ప్లాన్ చేశారా.? అంటే అవుననే అనిపిస్తోంది.

అనిల్ కుంబ్లే హెడ్ మాస్టర్ లా వ్యవహరిస్తున్నాడని.. అతడిని వదిలించుకునేందుకు కోహ్లీతో పాటు టీమిండియా క్రికెటర్లందరూ ప్లాన్ చేశారు. ఎంతో అనుభవం, దేశంకోసం పాటు పడ్డ అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి తప్పించారు. కుంబ్లే నిష్ర్కమణ దేశవ్యాప్తంగా దుమారం రేగగా.. బీసీసీఐ కూడా క్రికెటర్లకే వంత పాడడం విస్మయం కలిగిస్తోంది.

కుంబ్లే లాంటి నిజాయితీపరుడు కోచ్ పదవి నుంచి నిన్న వైదొలగగానే మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోహ్లీ, క్రికెటర్ల సపోర్టు రవిశాస్త్రికే ఉందని.. వారి కోరిక మేరకే రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడనే వార్త వినిపిస్తోంది. మొత్తానికి కోహ్లీతోపాటు క్రికెటర్లంతా కుంబ్లేను పొగబెట్టి సాగనంపారని అర్థమవుతోంది.

To Top

Send this to a friend