నవదీప్ బుక్కైపోయాడు..

బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. శని, ఆదివారాలు ఎన్టీఆర్ రావడంతో రేటింగ్స్ బాగా వస్తున్నాయి. షోను మరింత రక్తి కట్టించేందుకు ఈ శని ఆదివారాలు మరోసారి ఆశ్చర్యకరంగా ఇద్దరిని తీసేసారు. షో నుంచి మహేశ్ కత్తి, కల్పనలు ఎలిమినేట్ అవ్వడంతో షోలో మగవారి సంఖ్య నలుగురికి పడిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితులతో పాటు బిగ్ బాస్ లోకి హీరోగా వెలుగుతున్న నవదీప్ ను ఎంట్రీ ఇప్పించారు. బిగ్ బాస్ కి మరింత స్టార్ కళ తెచ్చేందుకు ఇద్దరినీ ఎలిమినేట్ చేసి వారి ప్లేసులో హీరో నవదీప్ ను పెట్టినట్టు అర్థం అవుతోంది. ఇందుకోసం నవదీప్ కు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టు సమాచారం.

ఇప్పటికే 29 రోజులు పూర్తయ్యింది. మిగిలిన 40 రోజులు అంటే సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉండడంతో షోను పీక్ స్టేజికి తీసుకెళ్లేందుకు ఇండస్ట్రీలో పేరున్న నవదీప్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నట్టు అర్థమవుతోంది. దీంతో ఈ కుర్ర హీరో నవదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ షో మరో మెట్టుకు స్టార్ కళతో ఎగబాకనుంది.

నవదీప్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో బిజీగా ఉన్నాడు. నెల రోజులు బిగ్ బాస్ హౌస్ లోకి ఉండడానికి రావడంతో అతడు ఇక బిగ్ బాస్ హౌస్ అరెస్ట్ అయిపోయినట్టే .. ఎందుకంటే టీవీ, ఫోన్, సమాచారం లేకుండా ఆ ఇంట్లో ఆ పది మంది మధ్య ఉండడం ఎంతకష్టమో.. నవదీప్ ఉంటాడో ఉండడో రాబోయే రోజుల్లో తేలనుంది.

To Top

Send this to a friend