బిగ్ బాస్ లోకి హీరోయిన్, హాట్ యాంకర్

బిగ్ బాస్ లోని సెలబ్రెటీలందరూ ఫ్రెండ్స్ గా ఉంటూ బాగా వండుకొని, ఆడుకుంటూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. దీంతో ఏ సంచలనాలు ఉండడం లేదు. సెలబ్రెటీలు ఆశించిన రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించకపోవడం, తమ టాలెంట్ కు తగ్గ ఆటపాటలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో షో పై ఆసక్తి రోజురోజుకు తగ్గుతోందట..

శని, ఆదివారాల్లోనే ఊపు.. మిగతా రోజుల్లో తుస్సుమంటుందా.? బిగ్ బాస్ షోకు వస్తున్న రేటింగ్స్ ను బట్టి చూస్తే అదే అనిపిస్తోంది. శనిఆదివారాల్లో ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో బిగ్ బాస్ ను చూసే జనాల సంఖ్య పెరుగుతోందట. మిగతా రోజుల్లో ఈ షోకు అంతగా ఆదరణ రావడం లేదట.. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గొడవలు, కాంట్రవర్సీ లేకుండా చప్పగా సమన్వయంతో సభ్యులు ముందుకు సాగడంతో ప్రేక్షకులను అలరించలేకపోతోందని టాక్.

బిగ్ బాస్ లో ఆసక్తి లేకపోవడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. మహేశ్ కత్తి, ఆదర్ష్, కల్పన లాంటి పేరు లేని సెలబ్రెటీల వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోందట.. ఈ వీకెండ్ లో బిగ్ బాస్ తాజా రేటింగ్స్ 6.94, 6.32, 5.45కు తగ్గిపోయాయట.. దీంతో పేరులేని ఇద్దరిని ఎలిమినేషన్ చేయించి .. ఆ ప్లేస్ లోకి ఓ గ్లామర్ హీరోయిన్, ఫేమస్ యాంకర్ ను ఎంట్రీ చేయాలనే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉందట.. దీంతోనైనా రేటింగ్స్ పెంచవచ్చని బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్టు సమాచారం

To Top

Send this to a friend