బిగ్ బాస్ లో పాల్గొనే సినీ ప్రముఖులు వీరే..

బిగ్ బాస్.. బిగ్ బాస్.. అంతటా అదే పేరు.. ఉత్తరాది నుంచి తెలుగుకు వచ్చిన ఈ ప్రోగ్రాం ఇప్పుడు తెలుగు నాట మాటీవీలో ప్రసారమవుతోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా నిన్న రాత్రి ఇది ప్రారంభమైంది. ఇందులో పార్టిసిపెంట్ ఎవరనే విషయంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది.. నిన్న రాత్రి జరిగిన తొలి షో ప్రసారంలో ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేశారు. ఇందులో బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కో ప్రముఖ సినీ సెలబ్రెటీలు ప్రవేశించారు. వీరందరూ 71 రోజుల పాటు ఎలా ఫోన్, ల్యాప్ టాప్, టీవీలేకుండా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ హౌస్ లో గడపనున్నారు..

మాటీవీ బిగ్ బాస్ లో కంటెస్టంట్ ల ఎంపికలో పారదర్శకత పాటించిందనే చెప్పవచ్చు.. తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లోని ప్రముఖులకు చోటివ్వడం విశేషం. తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులు మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబులను తీసుకుంది. ఇక మిగతా ఏపీ ప్రాంతానికి చెందిన శివబాలాజీ, ధన్ రాజ్, సమీర్ తో పాటు ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిలో పేరు ప్రఖ్యాతలు పొందిన డ్యాన్సర్ ముమైత్ ఖాన్ లకు చోటివ్వడం విశేషం.

బిగ్ బాస్ లో వర్ధమాన హీరోలతో పాటు గాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు చోటు కల్పించారు.. హీరోలు ప్రిన్స్, శివబాలజీ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, మహేశ్ కత్తి, నటుడు ఆదర్ష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్, ఐటం సాంగ్ లు చేసే డ్యాన్సర్ ముమైత్ కాన్ , తెలంగాణ గాయని మధుప్రియ, సింగర్ కల్పన, డ్యాన్సర్ జ్యోతి, కమెడియన్ ధన్ రాజ్ నిన్న రాత్రి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి దూరిపోయారు. ఇంతవరకు ఎవరా 12 మంది కంటెస్టెంట్ లు అని ఎదురుచూసిన తెలుగు జనానికి వారెవరో తెలిసిపోయింది..

To Top

Send this to a friend