బిగ్ బాస్ లో ముమైత్ ఖేల్ ఖతం..

బిగ్ బాస్ లో ఈ వారం కూడా ముమైత్ ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యింది. హరితేజతో కెప్టెన్ రేసులో అతిగా ప్రవర్తించి ముమైత్ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. ముమైత్ హౌస్ లో హిందీలోనే ఎక్కువగా మాట్లాడడం.. తోటి వారిని టార్గెట్ చేసి అతిగా ప్రవర్తించడంతో ఆమెపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. చీటికి మాటికి గొడవలు పడుతూ హౌస్ లో ఆమె ప్రవర్తనపై బిగ్ బాస్ టీం కూడా కినుక వహించినట్టు సమాచారం.

ఇక ఈ వారం కూడా ముమైత్ ను అందరూ నామినేట్ చేయడంతో ప్రేక్షకులందరూ ఆమెను ఎలిమినేట్ చేయడానికి ఓట్లు వేశారట.. దీంతో ఈ వారం మళ్లీ ముమైత్ ను సాగనంపడం ఖాయమని బిగ్ బాస్ వర్గాలు చెబుతున్నాయి.

బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా మారిన ముమైత్ ఖాన్ మొదట్లో బాగానే సందడి చేసింది. ముద్దులు , మురిపాలు, కాసింత రోమాన్స్, ఎక్స్ పోజింగ్ తో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేసింది. కానీ జనం ఆమె చేసిన అతికి 4వ వారానికే ఎలిమినేట్ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. అయితే ఆమెపై విశ్వాసంతో బిగ్ బాస్ టీం ముమైత్ ను సీక్రెట్ రూంలో ఉంచి.. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఇప్పుడు ఈ వారం ముమైత్ ను బయటకు పంపేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend