మోసపోతే బ్యాంకులు డబ్బులు తిరిగిచ్చేయాలి..

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో ఆన్ లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. దీన్ని క్యాష్ చేసుకుంటున్న ఆన్ లైన్ మోసగాళ్లు సులువుగా పిన్, డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లు హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఇటీవల ఈ మోసాలు ఎక్కువైపోయాయి. దీన్ని నుంచి రక్షణ కల్పించేలా రిజర్వ్ బ్యాంకు ఓ కొత్త నిబంధనను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. డబ్బులు కోల్పోయిన ఖాతాదారులకు బ్యాంకులే డబ్బులు తిరిగిచ్చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలిచ్చింది.

బ్యాంకు ఖాతాదారులు వివిధ సైట్లలో వెళ్లి ఏదైనా లావాదేవీ జరిపేటప్పుడు కార్డు నెంబర్, పేరు, ఎక్స్ పైరీ తేది, సీవీ లాంటి వివరాలు ఇచ్చాక వాటిని ఎవరైనా తస్కరించి డబ్బులు కొట్టేస్తే .. ఆ డబ్బులను ఖాతాదారుల వారం లోపు ఫిర్యాదు చేస్తే తిరిగి ఇచ్చేయాలని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. మూడు రోజుల్లోనే బ్యాంకుకు ఖాతాదారు తెలియజేస్తే పదిరోజుల్లోగా ఖాతాలో డబ్బులు వేయాలని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది.

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా మోసం జరిగినా వడ్డీ కూడా నష్టపోకుండా బ్యాంకులు చెల్లిస్తాయి. రూ.5 వేల నుంచి రూ.25 వేల లోపు డబ్బులు కాజేస్తే 10 రోజుల్లోగా చెల్లిస్తారు. మిగతా మొత్తమైతే పోలీస్ కేసు పెట్టి కొద్దిరోజుల తర్వాత రికవరీ చేసి ఇస్తారు. ఇందుకోసం వెంటనే బ్యాంకులు తమ హోం పేజీల్లో ప్రత్యేకంగా మోసపోయిన బాధితుల కోసం డైరెక్ట్ లింక్ ను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలిచ్చింది.

To Top

Send this to a friend