నంద్యాలలో కాల్పుల కలకలం..

నంద్యాల ఉప ఎన్నిక మగిసి ఒకరోజు గడవకముందే విద్వేషాలు బయటపడ్డాయి. వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి పై టీడీపీకి చెందిన భూమా వర్గీయులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శిల్పా చక్రపాణిరెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. భూమా కుటుంబానికి సానుభూతిపరుడిగా ఉంటున్న మధు అనే వ్యక్తి .. శిల్పా చక్రపాణిపై అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే శిల్పా తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పుల సంఘటన చోటు చేసుకోవడంతో భూమా వర్గీయులను, శిల్పా వర్గీయులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టారు.

మైనార్టీ నాయకుడు చింపింగ్ చనిపోగా ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై నంద్యాలలోని సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన ముధుపై ఇదివరకే రౌడీషీట్ ఉంది. ఎన్నికల సమయంలో మధుకు చంద్రబాబు సర్కారు ఇద్దరు గన్ మెన్ లను కేటాయించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గీయులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటన నేపథ్యంలో నంద్యాలలో మరో సారి టీడీపీ ఆకృత్యాలు బయటపడ్డట్టు అయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ నేతకు వచ్చిన జనాదరణను చూసే టీడీపీ రౌడీలతో ఆయన్ను హతమర్చేందుకు కుట్ర పన్నిందని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ దొంగదెబ్బ తీస్తూ ప్రజల్లో గెలవాలనుకుంటోందని.. కానీ వైసీపీ దాన్ని తిప్పికొడుతుందని.. నంద్యాలలో వైసీపీదే గెలుపు అని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు.

To Top

Send this to a friend