భారతీయుడి మేధస్సుకు 1285 కోట్లు


టాలెంట్ ఎక్కడైనా టాలెంట్.. దాన్ని వినియోగించుకుంటే కోట్లు పాదాక్రాంతమవుతాయి. అది తెలియక అమెరికన్ అధ్యక్షుడు ప్రాంతీయ బేధాలు రెచ్చగొట్టి ఇతర దేశాల మేధావులను అమెరికా నుంచి వెళ్లగొడుతున్నారు. నిజానికి అమెరికా కు వేల కోట్ల ఆదాయం రావడం వెనుక ఇతర దేశాలు.. ముఖ్యంగా భారతీయుల మేధస్సు ఉందన్నది ట్రంప్ మరిచిపోతున్నాడు.

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ను నడిపిస్తున్నది మన చైన్నై వాసి, ఐఐటీయన్ సుందర్ పిచాయ్.. గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక తీసుకున్న విప్లవాత్మక చర్యలతో సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగిందట.. దీంతో గూగుల్ పాలక మండలి 2016 సంవత్సరానికి గాను సుందర్ పిచాయ్ కు దాదాపు 1285 కోట్ల వేతనాన్ని సంవత్సరానికి పారితోషికంగా చెల్లించిందట.. ఇది ప్రపంచంలోనే అందరూ సీఈవోలు తీసుకుంటున్న వేతనానికి చాలా ఎక్కువ.. భారతీయుడి మేధస్సుకు దక్కిన గౌరవంగా ఇది నిలిచిపోయింది.

గూగుల్ సీఈవో గా సుందర్ బాధ్యతలు చేపట్టాక.. గూగుల్ వ్యాపారాన్ని విస్తరించారు. యూట్యూబ్ ను ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరువ చేశాడు. కొత్త స్మార్ట్ ఫోన్లను గూగుల్ ఆవిష్కరించింది. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గూగుల్ తయారు చేసింది. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, హార్డ్ వేర్ రంగాల్లో గూగుల్ పెట్టుబడులు పెట్టి కోట్లు ఆర్జిస్తోంది. ఇవన్నీ సుందర్ పిచాయ్ ఆలోచనల్లోంచి వచ్చినవే.. అందుకే గూగుల్ ను ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం కల్పించి లాభాలు తెచ్చిపెడుతున్న సుందర్ కు సంస్థ భారీ పారితోషికాన్ని అందించడం విశేషం..

To Top

Send this to a friend