బిగ్‌బాస్‌ షోకు ఎంపికైన భరత్‌, కాని ఇంతలోనే..!

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న బిగ్‌ బాస్‌ షో కోసం సెలబ్రెటీలను ఎంపిక చేసే పనిలో స్టార్‌ మాటీవీ ఉంది. తాజాగా రవితేజ సోదరుడు భరత్‌తో స్టార్‌ మా ప్రతినిధులు సంప్రదించాడు. అందుకు భరత్‌ ఓకే చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. వచ్చే నెలలో ముంబయిలో షూటింగ్‌ ఉంటుందని భరత్‌తో స్టార్‌ మా వారు చెప్పారు. ఇంతలోనే భరత్‌ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై యాక్సిడెంట్‌ కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే.

రవితేజ సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన భరత్‌ ఒక్క సినిమాతో కూడా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా అడపా దడపా ఇలాంటి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాని ఇంతలోనే మద్యంకు డ్రగ్స్‌కు బానిసైన భరత్‌ హఠాత్తుగా తనువు చాలించాడు.

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం వల్ల భరత్‌కు మంచి అవకాశాలు వస్తాయని ఆయన సన్నిహితులు భావించారు. కాని ఇంతలోనే ఇలా జరగడం దారుణంగా భరత్‌ స్నేహితులు బాధ పడుతున్నారు. అంతకంటే బాధకరమైన విషయం ఏంటి అంటే భరత్‌ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం దారుణం. చివరి రోజుల్లో భరత్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది.

To Top

Send this to a friend