భలే ఐడియా..


ఇప్పుడు సినిమాలు వందరోజులు ఆడడం లేదు. వారం తప్పితే మహా అయితే రెండు వారాలు అప్పటికల్లా అందరి మొబైళ్లలోకి ఈ సినిమాలు వచ్చేస్తున్నాయి. అందుకే నిర్మాతలు సాధ్యమైనన్నీ ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసి డబ్బులు దండుకుంటున్నారు. అందుకే బాహుబలి లాంటి దేశం గర్వించే చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, హిందీల్లో అన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు..

బాహుబలి 2 పార్ట్ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కథను జనాలకు అర్థం కావడానికి మొదటి భాగాన్ని మళ్లీ హిందీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే తొలి కథను చూస్తేనే రెండో పార్ట్ జనాలకు అర్థం అవుతుంది. అందుకే బాహుబలి1ను రీరీలిజ్ చేయనున్నట్టు రాజమౌళి, కరణ్ జోహర్ ప్రకటించారు.

హిందీ మార్కెట్ చాలా పెద్దది.. ఉత్తరాది మొత్తం జనాలు చూస్తే బాహుబలికి 1000 కోట్ల రాబడులు గ్యారెంటీ.. ఇప్పటికే బాహుబలి1 సోని మ్యాక్స్ లో ప్రసారమైంది. అయినా కూడా జనంలోకి బాహుబలి మేనియాను, కథను తీసుకుపోవడానికి నిర్మాతలు హిందీలో మొదటిపార్ట్ ను ఈ వారంలోనే రిలీజ్ చేస్తున్నారట.. దీంతో బాహుబలి2 కి కలెక్షన్ల జాతర తీసుకురావాడనికి సినిమా యూనిట్ ప్లాన్ చేసింది.

To Top

Send this to a friend