కిడ్నీ సమస్యల కి ఈ పండు దివ్యౌషధం..

నల్లనేరేడు పండును ఔషధ ఫలంగా పిలుస్తారు. ఈ పండు ఇటు వేసవి ముగింపు.. అటు వానాకాలం ఆరంభానికి మధ్య మే, జూన్ మాసంలో విరివిగా లభిస్తాయి. వేసవిలో మనకెంతో ఉపయోపడే పండ్లలో వగరు, తీపి, పులుపు మేళవింపు రుచితో ఉన్న నల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో వేడి నుంచి ఉపశమనం, చలువను అందిస్తాయి. ఆకలిని పుట్టిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి. విరోచనాలను నివారిస్తాయి. గుండె రక్తంలోని ఉష్ణాన్ని పోగొడతాయి.

* నేరేడు అంటే..
భారతదేశాన్ని అనాదిగా జంబుద్వీపం అని పిలుస్తారు. జంబు అంటే నేరేడు చెట్టు అని అర్థం. భారతదేశం నేరేడు చెట్లతో నిండి ఉన్న ప్రదేశంలో సమృద్ధికరమైన భూగర్భజలాలు నిండి ఉంటాయనీ, దీని వల్ల పాడి పంటలు సస్యశ్యామలంగా వెల్లువిరుస్తాయనీ అర్థం. అందుకే సగర్వంగా జంబుద్వీపే భరతకండే అని మన మంత్రాలలో చదువుతారు. నేరేడులోని అంగాంగాలు అన్నీ ఔషధాలుగా మనకు ఉపయోగపడతాయి. సంస్కృతంలో జంబు, సురభిపత్ర అనీ, హిందీలో జామూన్ అని, తెలుగులో కాకినేరేడు, అల్లనేరేడు అనీ, ఇంగ్ల్లిష్‌లో జంబుల్ ద బ్లాక్ ప్లమ్ అని పిలుస్తారు. నల్లనేరేడు కన్నా కాకినేరేడు ఉన్నతమైంది. ఇది వగరు, పులుపు రుచులు కలిగి తీపిగా మారుతుంది. విశేషంగా మధుమేహ రోగాలను, శ్లేష్మ, పైత్యరోగాలు, హృదయరోగాలను హరింపజేసి శారీరక పుష్టిని కలిగిస్తుంది.

* నేరేడుతో రోగాలు దూరం
నేరేడు గింజల్ని దోరగా వేయించి దంచి పొడి చేసుకుని నిలువ ఉంచుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి కషాయం కాచి, అందులో పాలు, తాటి కలకండ కలిపి కాఫీలాగా రెండు పూటలా తాగితే అతి మూత్రం, మధుమేహం అదుపులోకి వస్తాయి.

-సీజనల్‌లోనల్లనేరేడు పండ్లను రోజుకు కనీసం 10 తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. శుభకార్యాల్లోనల్లనేరేడు ఆకులను కడితే సూక్ష్మక్రిములు దరిచేరవు.

కాలేయానికి మేలే చేస్తుంది. ఎండాకాలంలో దాహాన్ని అరికడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఈ పండ్లు నివారిస్తాయి. కడుపులో ప్రమాదవశత్తూ తల వెంట్రుకలు, లోహపు ముక్కలపు సైతం కరిగిస్తాయి.

చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే చాలా మంచిది. పుల్లలతో పళ్లు తోమితే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసనను నివారిస్తుంది. చెట్టు ఆకులు ఎండబెట్టి చూర్ణంలో కొంచెం ఉప్పు కలిపి పళ్లు తోముకుంటే గట్టి పడతాయి.

కడుపులో నులి పురుగులను నివారిస్తుంది. మూత్రాశయ, నోటి క్యాన్సర్‌కు టానిక్‌లా పనిచేస్తుంది. చెట్టు ఆకులను గాయంపై కట్టవచ్చు. విటమిన్ ఏ, సీ అధికంగా లభిస్తుంది. శరీరంపై కాలిన గాయాలుంటే తర్వాత మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది.

*నేరేడు పండు పానీయం..
బాగా పండిన నేరేడు పండ్లను పిసికి గింజలు తీసి వేసి ఆ గుజ్జును తూకం వేసి, సమానంగా పటిక బెల్లం దానిలో కలిపి కరిగించి చిన్న మంటపైన పాకం వచ్చే వరకు మరిగించి దించి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు చెంచాలు మోతాదుగా ఈ పాకాన్ని అరగ్లాసు మంచినీటిలో కలిపితే తీయని రుచికరమైన పానీయంగా ఉంటుంది.దీన్ని సేవిస్తే పొడిదగ్గు, రక్తక్షీణత గొంతు సమస్యలు నివారించవచ్చు.

To Top

Send this to a friend