బెంబేలెత్తిస్తున్న జియో నిర్ణయం


ఇప్పటికే జియో ఆగమనంతో నష్టాల పాలవుతున్న ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లకు మరింత షాక్ ఇచ్చేందుకు రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ రెడీ అయ్యారట.. అందులో భాగంగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్లకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇందులో భాగంగా జియో ఫ్రీ స్కీమ్స్, డిస్కౌంట్స్ ఆఫర్లను మరో సంవత్సరం లేదా 18 నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ తర్వాత వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారట.

జియో ఉచిత ఆఫర్లతో ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు అన్ లిమిటెడ్ ఆఫర్లను సరాసరిగా రూ.350కి అటుఇటుగా నెలవారి చందాతో అందిస్తున్నాయి. దీంతో నెలకు 350 మాత్రమే ఒక్కో వినియోగదారు నుంచి కంపెనీకి వస్తోంది. దీనివల్ల ఆ టెలికాం రంగ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయట. అందుకే జియో ఉచిత ఆఫర్లను ఎత్తివేయాలని ఫైట్ చేస్తున్నాయి.

ఇలానే జియో ఉచిత ఆఫర్లు ప్రకటిస్తే జియోతో పాటు ప్రత్యర్థి కంపెనీలు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రత్యర్థి కంపెనీలకు ఆదాయం తగ్గి అవి మూతపడే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ కాలం ఇదే ఆఫర్లను కొనసాగించడం ఏ కంపెనీకి సాధ్యం కాదు. దీనివల్ల ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు కుదేలవడం ఖాయం. అందుకే జియో ఇలానే మరో సంవత్సరం ఆఫర్లను ప్రకటించి ప్రత్యర్థి కంపెనీలను దెబ్బతీసి తాను కస్టమర్లను ఆకట్టుకోవాలని పెద్ద ప్లాన్ చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

To Top

Send this to a friend