అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.4 షూటింగ్ ప్రారంభం !!


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్-ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 6వ చిత్రం కావడం విశేషం.
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందనున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) ప్రతినాయక పాత్రలు పోషించనున్నారు. ఓ ప్రముఖ బాలీవుడ్ కథానాయికను బెల్లంకొండ సరసన సెలక్ట్ చేయనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. “”డిక్టేటర్” అనంతరం నా దర్శకత్వంలో తెరకెక్కనున్న 6వ చిత్రమిది. ఒక డిఫరెంట్ జోనర్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయనున్నాను. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా.. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. మ్యూజికల్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించనుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ పీటర్ హైన్స్ ఈ సినిమా కోసం డిఫరెంట్ ఫైట్స్ ను డిజైన్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు ఈ చిత్రానికి మాటలు రాయనున్నారు. నేటి నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో రెగ్యులర్ షూట్ ప్రారంభించాం. తర్వాత ఒక మేజర్ షెడ్యూల్ ను ఫారిన్ లో ప్లాన్ చేస్తున్నాం. ఓ బాలీవుడ్ హీరోయిన్ ను బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెలక్ట్ చేయనున్నాం” అన్నారు.

అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ.. “శ్రీవాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండడం.. ఇప్పుడు ఈ ప్రోజెక్ట్ ఇలా సెట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కథకి తగినట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ ను వేశాం. బెల్లంకొండ శ్రీనివాస్ తోపాటు శ్రీవాస్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ చిత్రం రూపొందనుంది. ” అన్నారు.

ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

To Top

Send this to a friend