బెజవాడ బెబ్బులి హఠాన్మరణం..


విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ హఠాత్ మరణం పొందారు. హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. నెహ్రూ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నెహ్రూ కేర్ ఆస్పత్రిలో రెండురోజుల క్రితం వరకు చికిత్స పొందారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 4.25 గంటలకు మృతిచెందారు.

నెహ్రూ రాజకీయ ప్రస్తానం.:
బెజవాడ రాజకీయాల్లో నెహ్రూ ఎదిగారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరి కంకిపాడు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కంకిపాడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 30 ఏళ్లుగా బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నెహ్రూకు ఓ కుమారుడు అవినాశ్, కుమార్తె ఉన్నారు. వార్త తెలిసిన వెంటనే దేవినేని ఉమ, టీడీపీ సీనియర్ నేతలు, నెహ్రూ అనుచరులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని నెహ్రూ ఇంటికి వెళ్లారు.

కాగా నెహ్రూ అనారోగ్యం దృష్ట్యానే కొద్దికాలంలో కొడుకు అవినాశ్ ను రాజకీయాల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకోసమే ఇటీవలే కాంగ్రెస్ లో ఉన్న నెహ్రూ టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో కొడుకును ఎమ్మెల్యే చేద్దామని ఆశించారు. కానీ ఇప్పుడు హఠాన్మరణం పొందారు.

To Top

Send this to a friend