నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘పైసా వసూల్’ చిత్రం కోసం పోర్చ్గల్లో షూటింగ్ నిమిత్తం ఉన్నారు. నేడు పుట్టిన రోజు సందర్బంగా ఫేస్బుక్ లైవ్‌లో ఆయన అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యాడు. షూటింగ్లో కాస్త ఎక్కువ ఫోర్స్‌తో డైలాగ్స్ చెప్పడం మరియు నీటిలో ఎక్కువ తడవడం కారణంగా బాలయ్య గొంతు పోయింది. ఆయన మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినా కూడా ఫ్యాన్స్ కోసం డైలాగ్‌ను కూడా బాలయ్య చెప్పాడు.
బాలయ్యతో పాటు దర్శకుడు పూరి జగన్నాధ్ మరియు నిర్మాత కూడా ఈ లైవ్‌లో పాల్గొన్నారు. దాదాపు గంట సమయం బాలయ్య అభిమానులతో సరదాగా చిట్‌చాట్ చేయడం జరిగింది. అభిమానులు మొదటి సారి బాలయ్య ఫేస్బుక్ లైవ్‌లోకి రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య గురించి పలు పంచ్ డైలాగ్స్, కొన్ని స్లో గన్స్‌ను అభిమానులు చెప్పడం, వాటికి బాలయ్య మురిసి పోవడం జరిగింది. షూటింగ్ బాగా జరుగుతుందని, తప్పకుండా మీ అందరి అంచనాలు అందుకుంటామని దర్శకుడు పూరి చెప్పుకొచ్చాడు.
మొదటి సారి పూరితో సినిమా చేస్తున్నా కూడా కంఫర్ట్‌గా చేస్తున్నాను అని, తప్పకుండా ఫ్యాన్స్ మెచ్చే పైసా వసూల్ చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలోనే త్వరలోనే సినిమాకు సంబంధించిన టీజర్‌ను తీసుకు వస్తామని దర్శకుడు పూరి ప్రకటించాడు. దసరాకు ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
