బాలయ్య కారు ఆరు కోట్లు.. నంబర్ 7.70 లక్షలు


కారు ఖరీదే ఆరు కోట్ల రూపాయలు.. నెంబర్ కు లక్షల్లో ఖర్చు పెట్టడం పెద్ద వింతే కాదు.. అయినా డబ్బున్న ఆసాములకు ఇది పెద్ద లెక్కే కాదు.. ఇచ్చింది మురిపాల కూతుళ్లు… దాదాపు ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే కారు.. ఇక దానికి లైసెన్స్ నంబర్ కోసం ఎంత పెడితే ఏముంది అనుకున్నారో ఏమో కానీ హీరో బాలక్రిష్ణ దాదాపు 7.70 లక్షలు ఖర్చు చేసి 1వ నంబర్ ను దక్కించుకున్నారు..

తనకు బర్త్ డే సందర్భంగా కూతుళ్లు కోట్లు పెట్టి కొనిచ్చిన కారుకు ఏకంగా 1 వ నంబర్ కోసం 7.70 లక్షలు ఖర్చు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టీఎస్ 09ఇయూ 0001 నంబర్ ను బాలయ్య కారుకు అధికారులు కేటాయించారు.

బాలయ్య కూతుళ్లిద్దరు ఇప్పుడు పెద్ద పొజిషన్ లో ఉన్నారు. పెద్ద కుమార్తె ఏపీ సీఎం కోడలిగా ఉండగా.. హారిటేజ్ పాల వ్యాపారంను నడిపిస్తున్నారు. చిన్న కూతురు బడా పారిశ్రామిక వేత్త కొడుకుకు ఇచ్చి చేశారు. దీంతో తండ్రి బర్త్ డే సందర్భంగా ఇద్దరు కలిసి 6 కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికి ఉబ్బితబ్బియైన బాలక్రిష్ణ కారు నంబర్ కోసం ఏకంగా 7.70లక్షలు వెచ్చించడం పెద్ద వింతేమీ కాదని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

To Top

Send this to a friend