జూలై 10 నుంచి నటసింహ బాలకృష్ణ రెగ్యులర్‌ షూటింగ్‌

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ జూలై 10న ప్రారంభమవుతుంది. జూన్‌ 10 పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జూలై 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించడం ఎంతో ఆనందంగా వుందని నిర్మాత సి.కళ్యాణ్‌ తెలిపారు.
ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.

To Top

Send this to a friend