‘స్పైడర్‌’ టీజర్‌ చూసి బాలయ్య నిర్ణయంలో మార్పు!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘స్పైడర్‌’. ఈ సినిమా 110 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు టీజర్‌ విడుదల తర్వాత రెట్టింపు అయ్యాయి. ఒక రోబో స్పైడర్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లుగా టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. సినిమా స్థాయి టీజర్‌తో మరింత పెరిగింది. సినీ ప్రముఖుల నుండి ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులకు కూడా స్పైడర్‌ టీజర్‌కు ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు దసరాకు చిత్రాన్ని విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే దసరా బరిలో బాలకృష్ణ, పూరి జగన్నాధ్‌ల మూవీ ఉంది. ఆ సినిమా ప్రారంభం రోజే డేట్‌ను అనౌన్స్‌ చేశారు. సెప్టెంబర్‌ 29న ఆ సినిమా విడుదల కాబోతుంది. బాలయ్య సినిమాకు రెండు రోజుల ముందు అంటే సెప్టెంబర్‌ 27న విడుదల చేయాలని స్పైడర్‌ టీం భావిస్తుంది.

స్పైడర్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ వసూళ్లను సాధించడం ఖాయం. ఇలాంటి సమయంలో మహేష్‌కు పోటీగా బరిలోకి దిగడం అవివేకం అవుతుందని కొందరు అంటున్నారు. అందుకే బాలయ్య నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే ముందుగానే ప్రకటించిన డేటు కనుక ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని స్పైడర్‌ చిత్రాన్ని వారం ముందు కాని, వారం ఆలస్యంగా కాని విడుదల చేసేలా చర్చు జరపాలని పూరి అండ్‌ టీం భావిస్తున్నారు. మొత్తానికి బాలయ్యను స్పైడర్‌ ఆందోళనకు గురి చేస్తుంది.

To Top

Send this to a friend