ఓ బాలయ్య.. నువ్ ఎమ్మెల్యేవయ్యా..

 

సీనియర్ ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కుమారుడు కం స్టార్ హీరో బాలయ్య నాన్నలా ఓపికను మాత్రం తెచ్చుకోలేదు. అప్పట్లో ఆవేశంలో ఓ నిర్మాతనే కాల్చేశాడు. బాలయ్య సినిమాల్లోనూ, బయటా కూడా చాలా అగ్రెసివ్. నోటికి ఎది వస్తే అది అనేస్తుంటారు. ఊరికే చిర్రుబుర్రులాడుతుంటారు. అదే ఆయనకు మైనస్ గా మారుతోంది. బాలయ్య ఇప్పుడు తానో ప్రజాప్రతినిధి అన్న సంగతి మరిచి హిందూపురంలో నోరుజారుతూ స్థానికుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఎమ్మెల్యేగా బాలక్రిష్ణ అందుబాటులో ఉండడం లేదనే అపవాదు ఆయన నియోజకవర్గంలో వినిపిస్తోంది. బాలక్రిష్ణ మూడు నెలల తర్వాత తన సొంత నియోజకవర్గం హిందూపురంలో శుక్రవారం పర్యటించారు. తొలిరోజే కార్యకర్తలు, అభిమానులుపై చిర్రుబుర్రులాడారు. లేపాక్షిలో బైక్ పై వెళుతూ అడ్డువచ్చిన పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పురం ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభం సమయంలో ఫొటోలకు అడ్డువస్తున్నాడని కార్పొరేటర్ రామ్మూర్తిపై ఫైర్ అయ్యారు. పక్కనే ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్ కేశవులును కూడా పక్కకు వెళ్లయ్యా అని దురుసుగా ప్రవర్తించారు. పూజ ఆలస్యంగా చేస్తున్న అర్చకుడిని కూడా బాలయ్య వదలకుండా ఎంతసేపయ్యా అని చిర్రుబుర్రులాడారు. బాలయ్య ఆగ్రవేశాలు చూసి స్థానికులు ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

పూరి జగన్నాథ్ తో కలిసి ప్రస్తుతం సినిమా తీస్తున్న బాలయ్య ఆ సినిమా షూటింగ్ గ్యాప్ లో ఈరోజు హిందూపురంలో పర్యటించారు. కానీ తన సహజసిద్ధంగా అందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిర్రుబుర్రులాడుతూ అసహనం ప్రదర్శిస్తూ స్థానికులకు కోపానికి గురయ్యాడు.

To Top

Send this to a friend