అంత పని చేస్తాడనుకోవడం లేదు


నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలైన తర్వాత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. పలు సార్లు ఆ సినిమాకు సంబంధించి బాలయ్య ప్రకటనలు చేయడంతో వెంటనే ఆ సినిమానే ఉంటుందని అంతా భావించారు. అయితే ఆ సినిమాకు కాస్త సమయం పడుతుందని, ఆ లోపు పూరితో ఒక సినిమా తీస్తానంటూ ‘పైసా వసూల్‌’ చేస్తున్నాడు. ఆ వెంటనే రవికుమార్‌ దర్శకత్వంలో ‘జయసింహా’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో బాలయ్య సినిమా చేయబోతున్నాడట.

అవును.. మీరు చదివింది నిజమే, వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ బాలయ్య ప్రధాన పాత్రలో అంటూ సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవలే బాలయ్య తన పుట్టిన రోజు సందర్బంగా వర్మతో సినిమా చేసే అవకాశం ఉందని సూచాయిగా చెప్పాడు. దాన్ని బేస్‌ చేసుకుని ఇప్పుడు ఈ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తల్లో ఒక్క శాతం కూడా నిజం ఉండి ఉండదు అని నందమూరి ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. వివాదాలకు పెట్టింది పేరైన రామ్‌ గోపాల్‌ వర్మకు ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య ఆ సినిమాను అప్పగించడు అని, ఆ ప్రాజెక్ట్‌ను బాలయ్య వర్మకు అప్పగిస్తే అంతకు మించిన దరిద్రమైన పని మరోటి ఉండదని స్వయంగా అభిమానులు అంటున్నారు. మొత్తానికి వర్మ, బాలయ్య సినిమాకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

To Top

Send this to a friend