బాలక్రిష్ణ-ఎన్టీఆర్ కలిసి బిగ్ బాస్ లో..


 
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘పైసా వసూల్’ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బాలక్రిష్ణ ఈ నెలాఖరులోపు బిగ్ బాస్ హౌస్ లో వెళ్లి ప్రమోషన్ చేస్తాడని తెలిసింది.  బిగ్ బాస్ షోను బేస్ చేసుకొని బాలక్రిష్ణ తన లేటెస్ట్ చిత్రం ‘పైసా వసూల్’ను ప్రమోట్ చేసేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికి ఎన్టీఆర్ కూడా స్వాగతించడంతో నందమూరి అందగాడు బాలయ్య త్వరలోనే బిగ్ బాస్ లో వెళ్లనున్నట్టు సమాచారం.
 

 ఇదే కనుక నిజం అయితే బాలయ్య-ఎన్టీఆర్ అభిమానులకు పండుగే.. ఈ ఇద్దరి హీరోల కలయిక జరిగితే నందమూరి అభిమానులు, సినీ ఇండస్ట్రీకి కూడా ఓ క్లారిటీ వస్తుంది. ఎన్టీఆర్ కు, బాలయ్యకు మధ్య ఎటువంటి విభేధాలు లేవని స్పష్టం అవుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
 

 టాలీవుడ్ స్టార్ హీరో బాలక్రిష్ణ, నవతరం హీరో ఎన్టీఆర్ లు తొలిసారి ఓ షో లో కలిసి కనిపించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగునాట ఇప్పటికే 16కు పైగా రేటింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇటీవలే తమ కొత్త సినిమాల ప్రమోషన్ లో భాగంగా హీరో రానా, విజయ్ దేవరకొండ, నటి తాప్సీలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తమ సినిమాలకు హైప్ సృష్టించారు. ఇప్పుడిక బాలక్రిష్ణ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది..

To Top

Send this to a friend