బాలయ్య సీటుకు ఎసరు తెచ్చేలా ఉందే..

ఎమ్మెల్యే బాలయ్య సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. హిందూపురం రావడం లేదు. ఆయన పేరు చెప్పి పాలన సాగిస్తున్న వారు అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదు. ప్రజాసమస్యలు పేరుకుపోతున్నాయి.ఎమ్మెల్యే బాలయ్య స్థానికంగా ఉండకపోవడంపై పెద్ద ఎత్తున ప్రజలు నాయకులు మండిపడుతున్నారు.

హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్యపై రోజురోజుకు వ్యతిరేకత తీవ్రమవుతోంది. ప్రజలు బాలయ్య పేరు చెబతేనే ఆగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అసలు బాలయ్య నియోజకవర్గంలో స్థానికంగా ఉండడం లేదని.. సమస్యలు తీర్చడం లేదని పెద్ద ఎత్తున ఉద్యమాలు గతంలో సాగాయి.. కొందరు గేదెకు బాలయ్య పేరు రాసి ‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’ అని రాస్తున్నారు. మరొకరు ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవన్నీ కలిసి 2019 ఎన్నికల నాటికి బాలయ్యకు ఎఫెక్ట్ అయ్యేలానే కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు హిందూపురం నియోజకవర్గం విషయంలో పట్టించుకోకపోవడం కూడా ఎమ్మెల్యే బాలయ్యకు మైనస్ గా మారింది. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య తగవులు, కొట్లాటలు కూడా బాలయ్యకు మైనస్ గా మారాయి. ఈ పరిణామాలన్నీ కలిసి బాలక్రిష్ణకు వచ్చేసారి హిందూపురంలో గెలుపు అంత వీజీ కాదని అనిపిస్తోంది.

To Top

Send this to a friend