బాలయ్య తెలుగోడు కాదట..

హీరో బాలక్రిష్ణ ఏ ఎండకాగొడుకు పట్టాడు. తన 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మూవీని తమిళ్ లో డబ్ చేశారు. చైన్నైలో జరిగిన శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో బాలయ్య మాట్లాడిన తీరు తమిళుల్ని ఆకట్టుకోగా తెలుగు నాట మాత్రం బాలయ్యపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదల చేసుకోవడం వరకూ ఓకే కానీ.. ఇలా తాను తమిళవాడిని అని చాటడం ఏం బాగాలేదని పలువురు విమర్శిస్తున్నారు.

బాలక్రిష్ణ చైన్నైలోని కలైవానర్ లో ‘శాతకర్ణి’ తమిళ పాటలను తమిళ అగ్రదర్శకుడు కేఎస్ రవికుమార్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. ‘తాను పుట్టింది తమిళనాడులోనేనని.. తాను తమిళనాడు నీరు తాగి పెరిగిన శరీరమని స్పష్టం చేశారు.’ తమిళనాడు నా పుట్టినిల్లు. ఆంధ్ర విడిపోవడానికి ముందు మనమంతా ఒకే రాష్ట్రం. మద్రాసు రాష్ట్ర ప్రజలం. నేనూ తమిళ బిడ్డనే. శాతకర్ణి తమిళ డబ్బింగ్ సినిమా కాదు.. అది భారతదేశ రాజు చరిత్ర. ఒక గ్రీకు రాజు నుంచి భారతదేశాన్ని కాపాడిన శాతకర్ణి చరిత్రను అందరూ తెలుసుకోవాలని ముగించారు.

తమిళనాడుకు దూరమై చాలా కాలమైనా బాలయ్య తమిళం మాట్లాడి అక్కడి వారిని అలరించారు. ఇలా బాలయ్య తమిళనాడు పోయి తాను తమిళుడినే అనడం తెలుగు నాట వివాదాస్పదమైంది. తెలుగు, తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్లం అని చెప్పుకునే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య ఇలా అనడంతో వివాదాస్పదమైంది.

To Top

Send this to a friend