బాలయ్యకు నో చెప్పి చిరుకు ఓకే..!

నందమూరి బాలకృష్ణ 101వ సినిమాగా ‘రైతు’ను చేయాలనుకున్న విషయం తెల్సిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో ఆ ప్రాజెక్ట్‌ అనుకున్నారు. ‘రైతు’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అమితాబచ్చన్‌ను అనుకున్నారు. బాలకృష్ణ మరియు కృష్ణవంశీలు స్వయంగా వెళ్లి అమితాబచ్చన్‌ను కలవడం జరిగింది. అమితాబచ్చన్‌ బిజీ షెడ్యూల్‌ పేరుతో ‘రైతు’లో నటించలేను అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో బాలయ్య ఆ ప్రాజెక్ట్‌ మొత్తాన్ని పక్కకు పెట్టేశాడు. ఎప్పుడైతే అమితాబచ్చన్‌ ఓకే చెప్తాడో అప్పుడే తాను ‘రైతు’ సినిమాను చేస్తానంటూ బాలయ్య తేల్చి చెప్పడంతో కృష్ణవంశీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేశాడు.

బాలకృష్ణతో నటించేందుకు నో చెప్పిన మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ ఇప్పుడు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట మెగా వర్గాల నుండి ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో నటించబోతున్నట్లుగా లీక్‌ అందింది. దాంతో వెంటనే అంతా కూడా సల్మాన్‌ ఖాన్‌ నటిస్తాడని భావించారు. అయితే తాజాగా మెగా ఫ్యామిలీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఉయ్యాలవాడలో కనిపించబోతున్న బాలీవుడ్‌ హీరో అమితాబచ్చన్‌ అని తేలిపోయింది.

ఒక కీలకమైన పాత్రలో అమితాబచ్చన్‌ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొంత కాలం క్రితం చిరంజీవి మళ్లీ సినిమాలు చేయాలని, చిరంజీవితో తాను నటించాలని కోరుకుంటున్నట్లుగా అమితాబచ్చన్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే నిజం అవ్వబోతుందా అనే చర్చ జరుగుతుంది. చిరంజీవి సినిమాలో ఒక చిన్న పాత్ర కనుక అమితాబచ్చన్‌ 10 రోజుల డేట్లు ఇస్తే సరిపోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend